*వసతి గృహాల ఆకస్మిక తనిఖీ..*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వసతి గృహాలను నేడు ఉప కులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల వేళల్లో విద్యార్థులు ఎవరు వసతి గృహాల్లో ఉండరాదని 75% హాజరు నియమాన్ని విధిగా పాటించాలని సూచించారు. విలువైన కాలాన్ని తమ భవిష్యత్తు నిర్మాణానికి వినియోగించాలని జ్ఞానంతో పాటు స్ఫూర్తిదాయకమైన జ్ఞాపకాలతో విశ్వవిద్యాలయం కళ్ళముందు కదలాడేలా కార్యాచరణ అవసరం అన్నారు.

