లక్ష్మీపురం అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసన..
లక్ష్మీపురం అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసన.. ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని లక్ష్మీపురం గ్రామ అంగన్వాడి సెంటర్లో శుక్రవారం అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.దీనికి ఆ గ్రామ సర్పంచి ముదిరెడ్డి కళావతి శ్రీనివాస్ రెడ్డి హాజరై చిరంజీవి ధనుంజయ్ కు అన్నప్రాసన చేసి చదువుల్లో బాగా రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు.అంగన్వాడి సెంటర్లో అన్నప్రాసన వేడుక నిర్వహించడం పట్ల బాలుని తల్లిదండ్రులు తేజావతు అనూష గణేష్ దంపతులను అభినందించారు. ప్రభుత్వం అంగన్వాడి ద్వారా అందచేసే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచి కళావతి సూచించారు. కార్యక్రమంలో...