prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 8:21 pm Digital Edition : PRAJA VANI

రోడ్డు ప్రమాద బాధితుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

రోడ్డు ప్రమాద బాధితుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది : సర్పంచ్ ఉమ సంజీవ్ రెడ్డి

రామాయంపేట, నవంబర్ 20 (ప్రజావాణి ప్రతినిధి: నరేష్ నాయక్)

రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడికి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించింది. రామాయంపేట మండలం ఆర్. వెంకటాపూర్ గ్రామానికి చెందిన నడిపోల్ల అరుణ్ కుమార్ గత ఏడాది రోడ్డు ప్రమాదంలో గాయపడగా, వైద్య ఖర్చుల కోసం మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును గ్రామ సర్పంచ్ యెంకుగారి ఉమ సంజీవ్ రెడ్డి బాధితుడికి అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు ఎంతో తోడ్పాటునిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రేవతి గట్టయ్య, తాడె హరీశ్, పుర్ర స్వామి, కవిత చిరంజీవి, నాగరాణి రాజాగౌడ్, రాచపల్లి ఎల్లయ్య, అక్షిత సంతోష్, పంచాయతీ కార్యదర్శి కొత్తేనుగు యాదగిరి, కారోబర్ రత్నం, మొగుళ్ల మల్లేశం, పిట్టల రాజు తదితరులు పాల్గొన్నారు.