మున్సిపల్ కార్యాలయంలోఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కార్యక్రమం
* మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
* కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి కౌన్సిలర్స్
జమ్మికుంట నవంబర్ 20 (ప్రజావాణి)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కార్యక్రమం జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అనేది ప్రారంభించడం చాలా సంతోషకరం ఇట్టి బీమా అనేది ప్రతి కుటుంబానికి ఒక భరోసా అని తెలుపుతూ ఇంత మంచి కార్యక్రమం ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు అని తెలుపుతూ ఇట్టి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై మీ వార్డుకు వచినటువంటి వార్డ్ ఆఫీసర్ వద్దకు మీయొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డులతో వెళ్లి ఈ యొక్క జీవిత బీమాను నమోదు చేసుకోగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి కౌన్సిలర్స్ మేనేజర్ గుర్రాల రాజిరెడ్డి వార్డ్ ఆఫీసర్స్, కార్యాలయ సిబ్బంది వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
