prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 1:54 pm Digital Edition : MAHESH MEDCHAL

మునిరాబాద్‌లో భూ రీ-సర్వే పనులను పరిశీలించిన కీసర ఆర్డీఓ వెంకటరెడ్డి

*మునిరాబాద్‌లో భూ రీ-సర్వే పనులను పరిశీలించిన కీసర ఆర్డీఓ వెంకటరెడ్డి*

*క్షేత్రస్థాయిలో సర్వే పురోగతిపై అధికారులతో సమీక్ష*

మేడ్చల్, నవంబర్ 20: మేడ్చల్ మండల పరిధిలోని మునిరాబాద్ గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే కార్యక్రమాన్ని కీసర రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) వెంకటరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న భూ రీ-సర్వే పనుల పురోగతిని, సర్వే ప్రక్రియను స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
భూ రీ-సర్వే పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఇప్పటివరకు ఎంత మేరకు పూర్తయ్యాయి అనే అంశాలపై సిబ్బందితో చర్చించారు. సర్వే ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల తహసీల్దార్ భూపాల్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కుమార్, సర్వేయర్ వినోద్ తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.