prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 4:06 pm Digital Edition : UPENDHAR JANAGON

మత్స్యకారుల దినోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ

 

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20 (ప్రజావాణి): రేపు జరిగే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కొమురవెల్లి మండల ముదిరాజ్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం కొమురవెల్లి మండల కేంద్రంలో మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. మండల అధ్యక్షులు పుట్ట కనకరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముదిరాజ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గీస బిక్షపతి, మాజీ జిల్లా డైరెక్టర్ తేలు ఇస్తారి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులందరూ ఒక్కతాటిపైకి వచ్చి తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. చెరువులపై మత్స్యకారుల హక్కులు, చేప పిల్లల నిధులు, మత్స్యకారుల పెన్షన్, బీమా, ఇతర సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా కృషి చేయాలని అన్నారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణకు ఐక్యతే ప్రధాన బలమని పేర్కొన్నారు.

ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా నవంబర్ 21న ఉదయం 11:30 గంటలకు కొమురవెల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద మత్స్యకారుల సమస్యలు, హక్కుల సాధన కోసం అధికారులకు వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు మండలంలోని అన్ని గ్రామాల మత్స్యకార సోదరులు, ముదిరాజ్ నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మండల కమిటీ కోరింది.

ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మల్లం బాలయ్య, కార్యదర్శి దండు నరసింహులు, జనరల్ సెక్రటరీ సార్ల లింగం, మండల కమిటీ సభ్యులు నీల బిక్షపతి, గొల్లపల్లి కనకయ్య, పాశం శీను, గొల్లపల్లి నాగరాజు, సార్ల సురేష్, సార్ల కిష్టయ్య, గొల్లపల్లి ఆంజనేయులు, పాశం స్వామి, బోయిన సురేష్, పాశం యాదగిరి, చింతల రమేష్ తదితరులు పాల్గొన్నారు.