prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 9:10 pm Digital Edition : PRAJA VANI

మఠంపల్లిలో నూతన చేయూత పింఛన్దారులకు పెన్షన్ పత్రాల పంపిణీ

మఠంపల్లిలో నూతన చేయూత పింఛన్దారులకు పెన్షన్ పత్రాల పంపిణీ

మఠంపల్లి: తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా, నిరుపేద కుటుంబాల్లో ఆనందం నింపడమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకు కట్టుబడి ఉందని మఠంపల్లి గ్రామ సర్పంచ్ యేసు మల్ల వీరలక్ష్మి పాపయ్య తెలిపారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా రేపు (నవంబర్ 21) ఉదయం 10 గంటలకు మఠంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

ఇటీవల విడుదలైన లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఉన్నవారు తప్పనిసరిగా నిర్ణీత సమయానికి గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకుని తమ పెన్షన్ అర్హత పత్రాలను స్వీకరించాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ ప్రజలకు, నూతన లబ్ధిదారులకు సర్పంచ్ యేసు మల్ల వీరలక్ష్మి పాపయ్యతో పాటు గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులు విజ్ఞప్తి చేశారు.