**భక్తుల దర్శనానికి దారి ఏదీ? అభయాంజనేయ స్వామి ఆలయ మార్గాన్ని పునరుద్ధరించాలి!**
వరంగల్ నగరంలోని ఓ సిటీలో 50 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లే మార్గాన్ని మూసివేయడంపై బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి మంగళ, గురు, శనివారాలతో పాటు పలు పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని, ప్రధాన రహదారి వైపు నుంచి ఉన్న దారిని మూసివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు తక్షణమే స్పందించి భక్తుల సౌకర్యార్థం ఆలయానికి వెళ్లే మార్గాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక ప్రతినిధులు, బీజేపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.