prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 6:13 pm Digital Edition : PRAJA VANI

బైరాన్ పల్లి గ్రామాన్ని సందర్శించిన భాష సాంస్కృతిక సంచాలకులు నరసింహారెడ్డి

బైరాన్ పల్లి గ్రామాన్ని సందర్శించిన భాష సాంస్కృతిక సంచాలకులు నరసింహారెడ్డి

పర్యాటక కేంద్రంగా బైరాన్ పల్లి తీర్చి దిద్దాలని సర్పంచ్ వినతి

మద్దూరు నవంబర్20, ప్రజా వాణి,

మండలంలోని బైరాన్ పల్లి గ్రామాన్ని చారిత్రక పోరాటశీల గ్రామంగా గుర్తించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం కోసం గల అవకాశాలను పరిశీలించాలని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తిని పురస్కరించుకొని బైరాన్ పల్లి గ్రామ విశిష్టతను అధ్యయనం చేయడం కోసం తెలంగాణ భాషా సంస్కృతిక సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి 20- 11-2026 గ్రామాన్ని సందర్శించారు.బైరాన్ పల్లి గ్రామంలో ఉన్న రజాకార్లను ఎదిరించడానికి కట్టిన బురుజును,అంగడి వీరన్న గుడిని, పురాతన భైరవ దేవాలయాన్ని గ్రామ సర్పంచ్ బర్మా రాజు మల్లయ్యతో కలిసి సందర్శించారు.గతంలో ఇదే అంశం మీద హెరిటేజ్ సంచాలకులు అర్జున్ రావు ఇదే విషయమై అధ్యయనం చేసి వెళ్లారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య ఈ గ్రామాన్ని వీరభైరాన్ పల్లి ప్రకటించాలని పర్యటక స్థలంగా గుర్తించాలని కోరారు.శుక్రవారం సందర్శించిన భాషా సాంస్కృతిక సంచాలకులు గతంలో సందర్శించిన హెరిటేజ్ సంచాలకులు కలిసి సంయుక్తంగా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తామని తెలిపారు.