నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం
భూమిలేని నిరుపేదలకు సైతం పథకం వర్తింపు.. అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలి
బెజ్జంకి, నవంబర్ 20 (ప్రజావాణి)
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని శుక్రవారం బెజ్జంకి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ గాజు రవళి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్పెషల్ ఆఫీసర్ భాస్కర్, ప్రత్యేక ఆహ్వానితులుగా పీసీసీ వైస్ చైర్మన్ బగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే గొప్ప కార్యక్రమమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భూమిలేని నిరుపేదలకు సైతం ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సంతోష్, ఎంపీడీవో ప్రవీణ్, డైరెక్టర్ మానస శంకర్, ఉప సర్పంచ్ టేకుల జ్యోతి, గ్రామ శాఖ అధ్యక్షులు కళ్లెం పోచయ్య, బోనగిరి రమేష్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు