అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి – ఎంపీడీఓ ప్రవీణ్
బెజ్జంకి, నవంబర్ 20 (ప్రజావాణి)
కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని శుక్రవారం బెజ్జంకి మండలంలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్హులైన కుటుంబాలకు పథకం ప్రయోజనాలు, అర్హతలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ ప్రవీణ్ మాట్లాడుతూ.. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల అర్హులకు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్, ఏఎంసీ వైస్ చైర్మన్ పర్ష సంతోష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్, గ్రామ సర్పంచ్ రవళి-శ్రీనివాస్, బైర సంతోష్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.