బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం దండేపల్లి, నవంబర్ 20 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సెక్టార్ పరిధిలోని అల్లిపూర్ గ్రామంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బాల్య వివాహాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దండేపల్లి మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్ఓ) మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, చిన్న వయసులో వివాహాలు జరిపించడం వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ...