ప్రేమించిన యువతికి న్యాయం చేయాలి.. అనితకు మాల మహానాడు నాయకుల మద్దతు
ప్రేమించిన యువతికి న్యాయం చేయాలి.. అనితకు మాల మహానాడు నాయకుల మద్దతు దండేపల్లి, నవంబర్ 20 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో ప్రియుడు గౌతమ్ ఇంటి ఎదుట గత రెండు రోజులుగా దీక్ష చేస్తున్న అనితకు మాల మహానాడు మండల నాయకులు మద్దతు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. గౌతమ్ అనే యువకుడు అనితను గత మూడు సంవత్సరాలుగా ప్రేమిస్తూ, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వివాహానికి నిరాకరిస్తున్నాడని అనిత ఆరోపిస్తోంది. తమ కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని, కులం అడ్డొస్తోందని...