prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 3:32 pm Digital Edition : PRAJA VANI

ప్రభుత్వం అందించే సామాజిక భద్రత పథకాలను వినియోగించుకోవాలి

ప్రభుత్వం అందించే సామాజిక భద్రత పథకాలను వినియోగించుకోవాలి

మద్దూరు గ్రామ సర్పంచ్ దామెర మల్లేశం

మద్దూరు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ పర్షరాములు

మద్దూరు నవంబర్20, ప్రజా వాణి,

ప్రభుత్వం అందించే సామాజిక భద్రత పథకాలను బ్యాంకు ఖాతాదారులు వినియోగించుకోవాలని మద్దూరు గ్రామ సర్పంచ్ దామెర మల్లేశం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ ఎం. పర్షరాములు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మద్దూరు బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రభుత్వం అందించే సామాజిక భద్రత పథకాలు అయిన ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, జన ధన్ ఖాతా, ప్రయోజనాలపై ప్రజలకు బ్యాంకు ఖాతాదారులకు అవగాహన కల్పించినట్లు వారు తెలిపారు. అదేవిధంగా గ్రామానికి చెందిన రంగు కిరణ్ కుమార్ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన చెక్కును నామిని, బ్యాంకులో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి ప్రమాద బీమా తీసుకొని మృత చెందడంతో ఆయన కుటుంబానికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ద్వారా అందిన రెండు లక్షల చెక్కును నామినికి అందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో,ఫీల్డ్ ఆఫీసర్ వై,అయ్యప్ప ,అటెండర్ అశోక్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.