జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20 (ప్రజావాణి):జిల్లాలోని లింగాలఘణపురం మండలం, నెల్లుట్ల గ్రామంలో శుక్రవారం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం‘ గ్రామపంచాయతీ ఆవరణంలో ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సింగ రామకృష్ణ పథకాన్ని ప్రారంభించి మాట్లాడుతూ, గత ప్రభుత్వాలలో రైతులకు మరియు చేనేత, వాళ్లకు మాత్రమే బీమా వర్తించేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబ యజమానికి ఈ బీమా వర్తింపజేయడం తెలంగాణలో అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.
ఈ సందర్బంగా ఎంపీడీఓ శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభించడం ఇది గొప్ప అవకాశమని అన్నారు. ప్రతి కుటుంబానికి భరోసా కల్పించే ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీఓ సంపత్, పంచాయతీ కార్యదర్శి అనిల్ రాజ్, ఉప సర్పంచ్ కావ్య ప్రభాకర్, వార్డ్ మెంబర్స్ కొయ్యడ అనిల్, వేల్పుల శోభారాణి, గొరిగే సందీప్, కత్తి శ్రీవాణి, బొజ్జం సునీత ప్రభాకర్, నల్ల అజయ్, నల్ల విల్సన్, బత్తిని వేణు, కొమ్మరాజుల రేణుక కొమురయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు మాచర్ల మహేందర్, నాయకులు కొయ్యడ రామలింగం, గడ్డం యాదగిరి, కుర్రెముల రమేష్, బెల్లంకొండ సోమనాథం మరియు అంగన్వాడి టీచర్స్, సిఏ లు, గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. 