prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 3:39 pm Digital Edition : PRAJA VANI

ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ జీవిత బీమా లక్ష్యం

ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ జీవిత బీమా లక్ష్యం

పథకం పోస్టర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు

రూ.30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి: నవంబర్ 21

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని 11వ వార్డు రంగంపల్లి బస్తీ దవాఖాన వద్ద ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి సంబంధించిన ఆన్‌లైన్ ప్రొసీడింగ్స్‌ను అందజేశారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అనంతరం పట్టణంలోని 3వ వార్డు గౌరెడ్డిపేట రోడ్డు రైల్వే గేటు వద్ద రూ.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, స్థానిక కౌన్సిలర్లు కుదరి అనూష మహేందర్, అక్కేపల్లి సుజాత క్రాంతి, ఇతర కౌన్సిలర్లు, పీఏసీఎస్ చైర్మన్ ముత్యాల నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మెప్మా ఆర్పీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.