పాక్స్ నామినేటెడ్ నియామకాలపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20 (ప్రజావాణి): తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పాక్స్ )లో నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్ల నియామకాలు చెల్లవని హైకోర్టు స్పష్టం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం నామినేటెడ్ నియామకాలు చేపట్టడం సరైన విధానం కాదని హైకోర్టు తీర్పు మరోసారి నిరూపించిందని పేర్కొన్నారు....