పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు.. కేసముద్రం మున్సిపాలిటీలో విద్యుత్ వృథాపై ప్రజల ఆవేదన
*పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు.. కేసముద్రం మున్సిపాలిటీలో విద్యుత్ వృథాపై ప్రజల ఆవేదన!* అభివృద్ధి పనులకు నిధులు మంజూరవుతున్న వేళ.. మరోవైపు వృథా అవుతున్న విద్యుత్! బాధ్యత ఎవరిది? అధికారుల పర్యవేక్షణ ఏది? కేసముద్రం నవంబర్ 19,ప్రజావాణి. కేసముద్రం మున్సిపాలిటీలో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతూ కనిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. మిట్టమధ్యాహ్నం సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నా.. వీధి దీపాలు మాత్రం రాత్రి వేళల్లో వెలిగినట్లుగానే పగటిపూట కూడా వెలుగులు విరజిమ్ముతున్నాయి. అవసరం లేకున్నా విద్యుత్ దీపాలు వెలుగుతుండటంతో విలువైన విద్యుత్ వృథా అవుతోందనే...