జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20 (ప్రజావాణి):జనగామ పట్టణంలోని భ్రమరాంబ ఫంక్షన్ హాల్లో పాలకుర్తి మండలం, శాతపురం కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు యకన్న మేనల్లుడు భరత్ రెడ్డి వివాహ మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆప్యాయంగా ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఆనందాలతో నిండాలని ఆకాంక్షిస్తూ వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.