prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 6:08 pm Digital Edition : UPENDHAR JANAGON

నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్సిపల్ ఛైర్పర్సన్ బాలమణి-శ్రీనివాస్ దంపతులు

 

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20 (ప్రజావాణి):జనగామ పట్టణంలోని PLJ కన్వెన్షన్ హాల్ లో శుక్రవారం ఘనంగా జరిగిన వివాహ వేడుకకు మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి – శ్రీనివాస్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

మాజీ మున్సిపల్ చైర్మన్ పోకల జమున – లింగయ్య మనుమడు మనిదత్త మరియు సాయిభ్రమరాంబిల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ శుభ సందర్భంగా మున్సిపల్ ఛైర్పర్సన్ దంపతులు వేదికపైకి వెళ్లి నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. నూతన దంపతులు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, అన్యోన్యంగా, ఆదర్శ దంపతులుగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

వారితో పాటు కౌన్సిలర్లు రజని, బాల భరద్వాజ్, భాస్కర్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.