*.నసురుల్లాబాదు మండల కేంద్రంలో కిరాణా దుకాణం లో అధికారుల ఆకస్మక తనిఖీలు.
నస్రుల్లాబాద్ నవంబర్ 20 (ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజున కిరాణా దుకాణాలలో బియ్యం ధరల పట్టిక తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. నిర్ణీతధరలకే విక్రయించాలి అధిక ధరలకు విక్రయిస్తే 6a కేసులు నమోదు చేస్తాము అధికారులు హెచ్చరిక. ఈ సందర్భంగా దుకాణంలో నిల్వ ఉన్న బియ్యం వివరాలను వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు అదే విధంగా ప్రభుత్వ ధరల ప్రకారమే బియ్యాన్ని విక్రయించాలని సూచించారు. ఈ ధరలు ప్రజలకు తెలిసే విధంగా బోర్డులను ఏర్పాటు చేయాలి. ప్రతి దుకాణ యజమాని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యాన్ని విక్రయించాలని లేనట్లయితే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎవరైనా వ్యాపారులు ఎక్కువ ధరలకు బియ్యం విక్రయించిన. చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యాన్ని అమ్మాలని 26 కేజీల బ్యాగులో అమ్ముకోవాలని దుకాణ యజమాని సూచించారు. ఈ తనిఖీలు ఎన్నోర్మెంట్ డిటి బాలయ్య అధికారులు, దుకాణ యజమానులు తదితరులు పాల్గొన్నారు.