prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 8:37 am Digital Edition : PRAJA VANI

ధర్వేశ్‌పురం శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ

*ధర్వేశ్‌పురం శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ*

*రూ.15 కోట్లతో ఆలయ సమగ్ర అభివృద్ధి, సుందరీకరణ పనులు*

*మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవ తో నిధులు మంజూరు*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశ్‌పురం లోని ప్రసిద్ధ శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ పట్టనుంది. ఆలయ సమగ్ర అభివృద్ధి, సుందరీకరణ తో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ, శాఖ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదన మేరకు తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టి.జి.టి.డి.సి) అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధులు మంజూరు చేస్తూ ఉత్తరలు జారీ చేసింది. ఆలయ పరిసర ప్రాంతాలను మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, పర్యాటక అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ఈ పనులు చేపట్టనున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ధర్వేశ్‌పురం ఆలయం ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటక పరంగా కూడా మరింత గుర్తింపు పొందనుంది. దర్వేష్ పురం శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని రూ.15 కోట్ల నిధులు మంజూరు చేయించడం పట్ల ఆలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి పాలకవర్గం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.