prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 9:45 am Digital Edition : PRAJA VANI

త్వరలో చేద్దాం: అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు

త్వరలో చేద్దాం: అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 19 అమరావతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతి జర్నలిస్టు హౌసింగ్ అంశంపై సానుకూలంగా స్పందించారు. అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి పాటిబండ్ల నాగశ్రీనివాసరావు గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి ని ఉండవల్లిలోని ఆయన ఇంటి వద్ద కలిసి అమరావతిలో జర్నలిస్టుల కోసం నిర్మించదలిచిన హౌసింగ్ ప్రాజెక్టు గురించి చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ త్వరలో ఈ అంశాన్ని పూర్తి చేద్దామని చెప్పారు. జర్నలిస్టు హౌసింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలను ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా అందఛేయటం జరిగింది. అదే సందర్బంలో అక్కడే ఉన్న ముఖ్యమంత్రి మరియు కార్యదర్శి ప్రద్యుమ్న గారి దృష్టికి కూడ విషయాన్ని తీసుకెళ్లగా ఆయన కూడ స్పందిస్తూ వెంటనే ప్రభుత్వం దీనిపై సమావేశం నిర్వహిస్తుందని చెప్పారు. వీరితో పాటు ఇతర ముఖ్య అధికారులను కలువటం జరిగింది.