prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 9:48 pm Digital Edition : PRAJA VANI

డబ్బులు ఇచ్చేది మోదీ సర్కారు.

*డబ్బులు ఇచ్చేది మోదీ సర్కారు..*
*పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం!* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 20 (ప్రజావాణి) మంచాల
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారులకు అందుతున్న ఆర్థిక సహాయం, పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా చేపడుతున్న గృహ నిర్మాణ కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన ప్రచార వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం వివిధ పథకాల ద్వారా నిధులు కేటాయిస్తూ ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని వీడియోలో పేర్కొన్నారు. ముఖ్యంగా పేదలకు ఇళ్ల నిర్మాణం, అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించే అంశాలను దృశ్యాల రూపంలో చూపించారు.
అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, పథకాల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సరైన సమాచారం అందించడం లేదని, కేంద్ర ప్రభుత్వ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తోందని వీడియోలో విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ పథకాల విషయంలో పరస్పర విమర్శలకు కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.