జిల్లా పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ ప్రతిభ
జిల్లా పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ ప్రతిభ ప్రజావాణి,నెల్లికుదురు:మహబూబాబాద్ జిల్లా స్థాయిలో నిర్వహించిన ఎన్నికల అవగాహన,క్విజ్ వ్యాసరచన పోటీల్లో పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల, నెల్లికుదురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జిల్లా స్థాయి క్విజ్ పోటీల్లో ఎస్.దీక్షిత్, అమృతవర్షిణి 4వ,స్థానం,వ్యాసరచన పోటీల్లో పి. సిరివెన్నెల 6వ,స్థానం సాధించగా వీరికి కలెక్టరేట్లో శుక్రవారం అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్ చేతుల మీదుగా బహుమతులు ప్రశంస పత్రాలు అందజేశారు.కార్యక్రమంలో మోడల్ స్కూల్ టీచర్ అంజుమ్ సుల్తానా తదితరులు ఉన్నారు. *అభినందించిన ప్రిన్సిపాల్:ఉపేందర్...