prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 5:59 pm Digital Edition : PRAJA VANI

జిల్లా పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ ప్రతిభ

జిల్లా పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ ప్రతిభ

ప్రజావాణి,నెల్లికుదురు:మహబూబాబాద్ జిల్లా స్థాయిలో నిర్వహించిన ఎన్నికల అవగాహన,క్విజ్ వ్యాసరచన పోటీల్లో పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల, నెల్లికుదురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
జిల్లా స్థాయి క్విజ్ పోటీల్లో ఎస్.దీక్షిత్, అమృతవర్షిణి 4వ,స్థానం,వ్యాసరచన పోటీల్లో పి. సిరివెన్నెల 6వ,స్థానం సాధించగా వీరికి కలెక్టరేట్లో శుక్రవారం అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్ చేతుల మీదుగా బహుమతులు ప్రశంస పత్రాలు అందజేశారు.కార్యక్రమంలో మోడల్ స్కూల్ టీచర్ అంజుమ్ సుల్తానా తదితరులు ఉన్నారు.

*అభినందించిన ప్రిన్సిపాల్:ఉపేందర్ రావు*

జిల్లా స్థాయి పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకువచ్చారని
ప్రిన్సిపల్ జి. ఉపేందర్ రావు విద్యార్థులను అభినందించారు.పోటీలకు విద్యార్థులను సన్నద్ధం చేసి మార్గదర్శకత్వం వహించిన గైడ్ టీచర్ పి. నవీన్ కుమార్ ను ప్రిన్సిపాల్ ప్రశంసించారు.
విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు ప్రాముఖ్యత, ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు వివిధ పోటీల్లో చురుకుగా పాల్గొని ఉన్నత స్థానాలు సాధించాలని ఆకాంక్షించారు.