జనగామ అభివృద్ధిపై సీఎంకు ఎక్స్‌లో విజ్ఞప్తి.. జనగామకు రండి మా సమస్యలు ఆలకించండి సార్ బిర్రు ఇస్తారి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20 (ప్రజావాణి): జనగామ నియోజకవర్గ అభివృద్ధిపై విద్య, ఉపాధి, వైద్యం అంశాలపై నాగరత్న సేవా సంఘం అధ్యక్షుడు బిర్రు ఇస్తారి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఎక్స్ (X) వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనగామ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని, విద్య, వైద్యం, ఉపాధిలో అవకాశాలు లేక ప్రతిరోజూ వందలాది మంది యువత విద్య, ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సౌకర్యాల...