prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 9:53 am Digital Edition : UPENDHAR JANAGON

జనగామ అభివృద్ధిపై సీఎంకు ఎక్స్‌లో విజ్ఞప్తి.. జనగామకు రండి మా సమస్యలు ఆలకించండి సార్ బిర్రు ఇస్తారి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20 (ప్రజావాణి): జనగామ నియోజకవర్గ అభివృద్ధిపై విద్య, ఉపాధి, వైద్యం అంశాలపై నాగరత్న సేవా సంఘం అధ్యక్షుడు బిర్రు ఇస్తారి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఎక్స్ (X) వేదికగా విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనగామ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని, విద్య, వైద్యం, ఉపాధిలో అవకాశాలు లేక ప్రతిరోజూ వందలాది మంది యువత విద్య, ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సౌకర్యాల కోసం కూడా హైదరాబాద్ వెళ్లాల్సిన దుస్థితి ఉందని, ముఖ్యమంత్రి గారు జనగామకు వచ్చి తమ సమస్యలు ఆలకించాలని కోరారు.

ముఖ్యమంత్రి కి చేసిన ప్రధాన విజ్ఞప్తులు:

1. జనగామకు మంజూరైన ఎ.టి.సి – అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌కు శంకుస్థాపన చేయాలి.

2. జనగామకు కాకతీయ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేయాలి.

3. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హైస్కూల్ ఏర్పాటు చేయాలి.

4. తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు చేయాలి.

5. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలి.

6. నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలి.

7. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయాలి.

8. పాలిటెక్నిక్ కాలేజీ మంజూరు చేయాలి.

9. లింగాల గణపురం మండలంలోని కళ్లెం గ్రామంలో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేసి, చేనేతకు సంబంధించిన భారీ పరిశ్రమలు తీసుకురావాలి.

10. ఏరియా హాస్పిటల్‌లో ఎం.ఆర్.ఐ స్కానింగ్, ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ, గుండెకు సంబంధించిన 2డి ఎకో, యాంజియోగ్రామ్ టెస్ట్ వంటి సౌకర్యాలు కల్పించాలి.

విద్యా కేంద్రాలు, వైద్య సౌకర్యాలు, పరిశ్రమలు వస్తే ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించినట్లు అవుతుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి గారు జనగామకు వస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశగా ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు.