prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 8:12 pm Digital Edition : PRAJA VANI

చీరాల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ వసూళ్ల ఆరోపణలు

చీరాల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ వసూళ్ల ఆరోపణలు

డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అదనపు వసూళ్లు

ఫీజు పేరుతో ప్రజలపై భారం

ఉన్నతాధికారులు స్పందించాలి

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి చీరాల, బాపట్ల జిల్లా నవంబర్ 20

చీరాల: రిజిస్ట్రేషన్ శాఖలో ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అయితే చీరాల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.
డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వసూళ్ల ఆరోపణలు ప్రజల్లో వెళ్లువేత్తుతున్నాయి.
భూములు, స్థలాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయానికి వచ్చే సామాన్య ప్రజలు డాక్యుమెంట్ రైటర్లను సంప్రదించాల్సిన పరిస్థితి ఉందని పలువురు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన రుసుములతో పాటు అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి.
ఫీజు టు ఫీజు పేరుతో అదనపు భారం తప్పడం లేదని ప్రజలు వాపోతున్నారు.
రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అధికారిక ఫీజులు, డాక్యుమెంట్ తయారీ ఖర్చులు కాకుండా ఇతర పేర్లతో కూడా డబ్బులు అడుగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వసూళ్లకు ఎవరి అనుమతి ఉంది ఈ మొత్తాలకు రసీదులు ఇస్తున్నారా వసూలైన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు?
ఈ వ్యవహారంపై జిల్లా రిజిస్ట్రార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. కార్యాలయంలో జరుగుతున్న లావాదేవీలు, డాక్యుమెంట్ రైటర్ల కార్యకలాపాలు, అదనపు వసూళ్ల ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.