చిన్ననాటి స్నేహితురాలికి అండగా నిలిచిన కడవెండి 2008-09 ఎస్ఎస్సీ బ్యాచ్ మిత్రులు
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20 (ప్రజావాణి): కష్టకాలంలోనే నిజమైన స్నేహం ఏమిటో తెలుస్తుందన్న సత్యాన్ని మరోసారి నిరూపించారు జిల్లాలోని దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామానికి చెందిన జెడ్పిహెచ్ఎస్ లో 2008-09 ఎస్ఎస్సీ బ్యాచ్లో చదివిన మిత్రులు. అనారోగ్యంతో భర్తను కోల్పోయి, తీవ్ర దుఃఉన్న చిన్ననాటి స్నేహితురాలు పడమటింటి (గండి) అనూషకు మానవతా దృక్పథంతో అండగా నిలిచి, తమ స్నేహబంధం ఎంత గొప్పదో చాటుకున్నారు. అనూష భర్త గండి యాదగిరి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడని తెలుసుకున్న వెంటనే చిన్ననాటి స్నేహితులంతా చలించిపోయారు....