prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 5:53 pm Digital Edition : PRAJA VANI

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం సర్పంచ్ మడకం కుమారి ఆంధ్రయ్య

*కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం సర్పంచ్ మడకం కుమారి ఆంధ్రయ్య*

*నారాయణపురం గ్రామపంచాయతిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పంపిణీ కార్యక్రమం*

ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 20

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వారావుపేట 19వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఇనుముల రేవంత్ రెడ్డి.సిద్దిపేటలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది.అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గసలహా, సూచనల మేరకు ఈరోజు అశ్వారావుపేట ఎంపీఓ.రాంరెడ్డి. నారాయణపురం సర్పంచ్ *మడకం కుమారి ఆంధ్రయ్య.ఉప సర్పంచ్ *ఆకుల శ్రీను.నారాయణపురం సెక్రటరీ క్రాంతి కుమార్.జిపిఓ కె. రమేష్.ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి *రూ. 5 లక్షల జీవిత బీమా18 నుండి 59 సంవత్సరాల.వయస్సు గల ప్రతి ఒక్కరూ అర్హులు.రేషన్ కార్డు కలిగిన ప్రతి వ్యక్తి ఈ పథకానికి అర్హులు వయస్సు ధృవీకరణకు ఆధార్ కార్డ్ ప్రాతిపదిక.కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణించినప్పుడు కుటుంబానికి ఆర్థిక సహాయం,
ఈ సందర్భంగా సర్పంచ్ మడకం కుమారి మాట్లాడుతూ,
అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫ్రీ బస్సు, గృహ జ్యోతి, పెన్షన్లు, రైతు భరోసా, రైతు బీమా, గ్రామ డెవలప్మెంట్ పథకాలు వంటి అనేక పథకాలను గ్రామ అభివృద్ధి కొరకు ప్రవేశపెట్టడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఇలాంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు,గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు, చిన్నలు, పెద్దలు, గ్రామపంచాయతీలో ఉన్న అక్కచెల్లెమ్మలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు,