prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 9:18 pm Digital Edition : PRAJA VANI

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదోడి సొంతింటి కల సాకారం

*కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదోడి సొంతింటి కల సాకారం*

*మన ప్రజావాణి మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-*

రాష్ట్రంలో కొలువైన రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదోడి సొంతింటి కల సాకారం అవుతుందని జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ తెలిపారు. శుక్రవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు మంజూరైన లబ్ధిదారులు అన్నం అశోక్ – చంద్రకళ ల నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి నూతల గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆత్మగౌరవంతో కూడిన గృహ వసతి కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవ, నిరంతర కృషి, మార్గదర్శకత్వంతో నియోజకవర్గంలోని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు పథకంతో లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.