prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 6:06 pm Digital Edition : PRAJA VANI

ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం జిల్లా కలెక్టర్‌ను కలిసిన మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ మరియు – ఎస్సీ సెల్ అధ్యక్షులు కొలిపాక సాయికిరణ్

*ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం జిల్లా కలెక్టర్‌ను కలిసిన మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ మరియు – ఎస్సీ సెల్ అధ్యక్షులు కొలిపాక సాయికిరణ్*

జవహర్ నగర్,నవంబర్ 20 (ప్రజావాణి ప్రతినిధి )

మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్, ఆధ్వర్యంలో
జవహర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ దొంతగాని శాంతి కోటేష్, అధ్యక్షతన, జవహర్‌నగర్ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీ కొలిపాక సాయికిరణ్, ప్రత్యేక చొరవతో గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ శ్రీ మిక్కినేని మను చౌదరి, IAS గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఈ సందర్భంగా జవహర్‌నగర్ డివిజన్ పరిధిలోని అర్హులైన ఎస్సీ (SC) లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే సబ్సిడీ రుణాల మంజూరు విషయంపై జిల్లా కలెక్టర్ గారితో ప్రత్యేకంగా చర్చించడం జరిగింది.

ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత, పేద కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు, స్వయం ఉపాధి అవకాశాలు పొందేందుకు ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు ఎంతో దోహదపడతాయని కొలిపాక సాయికిరణ్ గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

దీనిపై జిల్లా కలెక్టర్,
సానుకూలంగా స్పందిస్తూ, ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలకు సంబంధించిన అర్హతలు, విధివిధానాలు మరియు దరఖాస్తు ప్రక్రియ గురించి వివరించడం జరిగింది.

ఎస్సీ వర్గాల అభ్యున్నతి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, పేద కుటుంబాల ఆర్థిక స్వావలంబన కోసం ఎస్సీ సెల్ అధ్యక్షులు కొలిపాక సాయికిరణ్ గారు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా నాయకులు అభినందించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరంతరం కృషి చేస్తారని తెలిపారు.

జవహర్ నగర్
మాజీ అధ్యక్షులు సత్యం వంశరాజ్, జవహర్ నగర్ ప్రధాన కార్యదర్శి డి ఎస్ ఎస్ వెంకటేశ్వర్,మాజీ కార్పొరేటర్ ప్రేమల శ్రీనివాస్, రాజు యాదవ్,తదితరులు ఉన్నారు.

దళితుల సంక్షేమమే లక్ష్యం – అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలే అండగా నిలవాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఆశయం.