prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 8:33 am Digital Edition : PRAJA VANI

ఇందిరా గాంధీ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి

*ఇందిరా గాంధీ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి*

*కోహీర్‌ చౌరస్తా వద్ద ఘనంగా మాజీ ప్రధాని జయంతి వేడుకలు*

*నివాళులర్పించి కేక్ కట్ చేసిన గిరిధర్‌రెడ్డి, ఉజ్వల్‌రెడ్డి*

జహీరాబాద్, నవంబర్ 19 (ప్రజావాణి): దేశ అభ్యున్నతికి, ప్రజా సంక్షేమానికి భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని సెట్విన్ చైర్మన్ ఎన్ గిరిధర్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సిద్దం ఉజ్వల్‌రెడ్డి లు అన్నారు. గురువారం కోహీర్ మండలంలోని కవేలి చౌరస్తా వద్ద ఎస్‌ఎస్ హోటల్ సమీపంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలు, ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఆమె ఆశయాలు, ప్రజా సంక్షేమ లక్ష్యాలే కాంగ్రెస్ పార్టీకి నిరంతర స్ఫూర్తి అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కుటుంబ పెద్దలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రాంలింగారెడ్డి, మున్సిపల్ చైర్మన్లు యూనుస్, అశోక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బి శ్రీనివాస్‌రెడ్డి, నియోజకవర్గంలోని వివిధ మండలాలు, పట్టణాల కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, మల్లన్న పాటిల్, ఉదయ్ శంకర్ పాటిల్, నరేష్ గౌడ్, ముజఫర్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి, సీనియర్ నాయకులు శ్రీకాంత్‌ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శిరీష సురేందర్‌రెడ్డి, కోహిర్ చైర్మన్ మ్యాతారి అశోక్, సర్పంచులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.