prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 12:22 pm Digital Edition : PRAJA VANI

ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమాను సద్వినియోగం చేసుకోవాలి

ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమాను సద్వినియోగం చేసుకోవాలి

ప్రతి కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భరోసా

మద్దూరు తహసీల్దార్ ఏ. జి రహీమ్,

మద్దూరు ఎంపిడిఓ చిలుముల శ్రీనివాస్

మద్దూరు నవంబర్20, ప్రజా వాణి,

ప్రతి కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుటుంబానికి భరోసా కల్పించడానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రవేశపెట్టిందని అధికారులు తెలిపారు.శుక్రవారం మండలంలోని మర్మాముల గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ అధ్యక్షతన ఇందిరమ్మ జీవిత బీమా పథకం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ ఏ. జి రహీమ్, ఎంపిడిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ భీమాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని దీనికి ప్రభుత్వం కుటుంబ యజమాని అకాల మరణం చెందితే 5లక్షల భీమాను అందిస్తుందని అన్నారు.పథకం విధి విధానాలను గ్రామస్థులకు వివరించారు. ఈ పథకంలో 18-59 ఏళ్లు నిండిన కుటుంబ యజమాని, నామిని పేరును సూచిస్తూ గ్రామస్థాయి అధికారులకు అందించి నమోదు చేసుకోవాలన్నారు. ఈ బీమాకు ప్రతి సంవత్సరం రీనివల్ బిల్లు చేసుకుంటున్నారు. ఎవరికి ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేదన్నారు. గతంలో బీమా ఉన్న వారు కూడా ఇందులో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంలో నమోదు చేసుకొని కుటుంబానికి భరోసాగా నిలవాలని కోరారు.కుటుంబంలో ప్రధాన సంపాదకుడు(యజమాని) మరణిస్తే కుటుంబ సభ్యులు ఎన్ని ఇబ్బందులకు గురి అవుతున్నారో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభించిందన్నారు.ప్రతి కుటుంబ యజమాని నమోదు చేసుకుని తెలియని వారికి సమాచారం అందించి వారిని ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాలో భాగస్వాములు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బత్తినీ సిద్ధులు,ఎంపీఓ వెంకటేశ్వర్లు, క్యాంప్ సూపర్వైజర్ ఏ ఓ రామకృష్ణ, ఏపిఓ మంజుల, గ్రామ పంచాయతీ కార్యదర్శి బస్వరాజు అశోక్,వార్డు సభ్యులు , ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు,ఏ ఎన్ ఏం రేఖ, ఆశా,అంగన్వాడి, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.