prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 9:01 am Digital Edition : PRAJA VANI

ఆలేరులో చేయూత కొత్త పెన్షన్ పత్రాలు పంపిణీ

ఆలేరులో చేయూత కొత్త పెన్షన్ పత్రాలు పంపిణీ

ప్రజావాణి,నెల్లికుదురు:మండలంలోని ఆలేరులో చేయూత కొత్త పెన్షన్ పత్రాలను గ్రామ సర్పంచి నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి,ఉపసర్పంచి గన్న హరీష్ 31 మంది లబ్ధిదారులకు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.ఈ క్రమంలోనే వితంతువులకు, ఒంటరి మహిళలకు,గీతా కార్మికులకు, దివ్యాంగులకు ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేసిందన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యాకూబ్ రెడ్డి,ఉపసర్పంచ్ గన్న హరీష్,వార్డు సభ్యులు పోతరాజు నరేష్, డోనికేని భాగ్యలక్ష్మి, ఆమంద సుగుణమ్మ, షేక్ అక్తర్ గౌస్,దేవాలయ చైర్మన్ లు కృష్ణ, సుధాకర్,నాయకులు కాలేరు సూరయ్య, గుదే యుగేందర్,నర్సయ్య,దయాకర్, అజీమ్,లక్ష్మయ్య లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.