prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 7:36 pm Digital Edition : RAJASHEKARREDDY

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

 

అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనం పట్టివేత.. సీజ్ చేసి కేసు నమోదు

బెజ్జంకి, నవంబర్ 20 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని గుగ్గిళ్ల స్టేజ్ రాజీవ్ రహదారి వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న దోస్త్ పికప్ వాహనాన్ని పట్టుకున్నారు. TS08 UL 0883 నంబర్ గల వాహనంలో అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.డ్రైవర్ అనరాశి సంపత్ వద్ద అనుమతి పత్రాలు లేకపోవడంతో వాహనంతో పాటు ఇసుకను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట పరిధిలోని మోయతుమ్మెద వాగు నుంచి అక్రమంగా ఇసుక తవ్వి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తవ్వడం, రవాణా చేయడం చట్టరీత్యా నేరమని, అక్రమ ఇసుక దందాకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తోట తిరుపతి హెచ్చరించారు.