prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 3:57 pm Digital Edition : PRAJA VANI

అంకల్ గ్రామంలో ఇంకుడు గుంతలను పరిశీలించిన ఎంపీడీవో రవి ఈశ్వర్ గౌడ్.

*అంకల్ గ్రామంలో ఇంకుడు గుంతలను పరిశీలించిన ఎంపీడీవో రవి ఈశ్వర్ గౌడ్.*

నస్రుల్లాబాద్ నవంబర్ 20 (ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండల పరిధిలో అంకోల్ గ్రామంలో శుక్రవారం రోజు గ్రామంలో నిర్మిస్తున్న ఇంకుడు గుంతలను ఎంపీడీవో రవిశ్వర్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకుడు గుంతల నిర్మాణం పై అధికారులు అవగాహన కల్పించాలని వివరించారు. ఇంకుడు గుంతల వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జమున మోహన్, ఎంపీడీవో రమేశ్వర్ గౌడ్, అధికారులు, అధికారులు పాల్గొన్నారు