prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 7:42 pm Digital Edition : PRAJA VANI

85 వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్‌లో టెక్నికల్ ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణ – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

*85 వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్‌లో టెక్నికల్ ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణ – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐ.ఆర్.సి) లో ఏర్పాటు చేసిన సాంకేతిక ప్రదర్శన (టెక్నికల్ ఎగ్జిబిషన్) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. 400 స్టాల్స్‌ తో పాటు 104 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయని ఆయన తెలిపారు. సురక్షితమైన, నాణ్యమైన రహదారుల నిర్మాణం కోసం విధానకర్తలు, ఇంజనీర్లు, పరిశ్రమ ప్రముఖులను ఈ సదస్సు ఒకే వేదికపైకి తీసుకువస్తోందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ చారిత్రక వైభవానికి ప్రతీక అయిన రామప్ప ఆలయ నమూనా ప్రదర్శించడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని మంత్రి వెంకట్ రెడ్డి అన్నారు.