పోరుమామిళ్ల అభివృద్ధి పథంలో మరో అడుగు,సునీహ గెలుపు కోసం నల్లేరు విశ్వనాథ రెడ్డి ప్రచారం!
వైఎస్సార్సీపీ అభ్యర్థి షేక్ సునీహను భారీ మెజార్టీతో గెలిపించండి: నల్లేరు విశ్వనాథ రెడ్డి పిలుపు పోరుమామిళ్ల,కడప జిల్లా నవంబర్ 19ప్రజావాణి బద్వేల్ నియోజకవర్గంలోని ప్రముఖ మేజర్ గ్రామ పంచాయతీ అయిన పోరుమామిళ్లలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి షేక్ సునీహ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు విస్తృతంగా రంగంలోకి దిగాయి.ఈ నేపథ్యంలో,బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి ఆధ్వర్యంలో పోరుమామిళ్ల పట్టణంలో బుధవారం రాత్రి భారీ ఎత్తున ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఇంటింటి...