సీఎం పర్యటన వేళ బెజ్జంకిలో ప్రతిపక్ష నేతల ముందస్తు అరెస్టులు
బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బెజ్జంకి, నవంబర్ 19 (ప్రజావాణి) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా పర్యటన నేపథ్యంలో బెజ్జంకి మండలంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి నిరసనలు, ఆందోళనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామునే బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన పలువురు నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకుని బెజ్జంకి పోలీస్ స్టేషన్కు తరలించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బెజ్జంకి మండలంలో నిలిచిపోయిన...