prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 1:34 pm Digital Edition : PRAJA VANI

సిద్ధిపేట జిల్లా దళిత జర్నలిస్ట్ ఫోరమ్ ప్రధాన కార్యదర్శిగా పాకాల జాకబ్

సిద్ధిపేట జిల్లా దళిత జర్నలిస్ట్ ఫోరమ్ ప్రధాన కార్యదర్శిగా పాకాల జాకబ్

వ్యవస్థాపక అధ్యక్షుడు కాశపోగు జాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకూరి డేవిడ్

సిద్ధిపేట జిల్లా కర్రోళ్ల నవజీవన్

మద్దూరు నవంబర్19, ప్రజా వాణి,

సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జరిగిన దళిత జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర మహా సభలో దళిత జర్నలిస్ట్ ఫోరమ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కాశపోగు జాన్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకూరి డేవిడ్ ఆదేశాల మేరకు మద్దూరు మండలంలోని లద్నూరు గ్రామానికి చెందిన జర్నలిస్ట్ పాకాల జాకబ్ ను  నియమించినట్లు జిల్లా అధ్యక్షులు కర్రోళ్ల నవజీవన్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పాకాల జాకబ్ మాట్లాడుతూ నా ఎన్నికకు కృషి చేసిన రాష్ట్ర వ్యస్థాపక అద్యక్షులు జాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకూరి డేవిడ్, జిల్లా అధ్యక్షులు కర్రోళ్ల నవజీవన్ లకు కృతజ్ఞతలు తెలిపారు. దళిత జర్నలిస్ట్ ఫోరమ్ సంఘం బలోపేతానికి ఎల్లవేళల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.