వి ఆర్ పురం మండల పరిషత్ కొత్త సారధులు…..
MPP. గా. గొంది చంద్రయ్య. వైస్ MPP. కారం సుందరయ్య
మన ప్రజావాణి. నవంబర్ 19. వీఆర్ పురం మండలం.
పోలవరం జిల్లా చింతూరు డివిజన్ విఆర్ పురం మండలం మండల అభివృద్ధికి కృషి చేస్తాం. MPP.- వైస్ ఎంపిపి.
మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఎంపీపీ గొంది చంద్రయ్య వైస్ ఎంపీపీ కారం సుందరయ్య తెలిపారు. ప్రజలకు అవసరమైన తాగునీరు రహదారులు విద్యా వైద్యం పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని పోలవరం ప్రాజెక్టు సంబంధించిన ఆర్ అండ్ ఆర్ స్టే ఎలివేషన్ అన్ని గ్రామాల్లో ప్యాకేజీ ఇచ్చే విధంగా సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ప్రజా ప్రతినిధులు అధికారులు గ్రామస్తుల సహకారంతో మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు..
గొంది చంద్రయ్య ఎంపీపీ.
కారం సుందరయ్య వైస్ ఎంపీపీ అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు