prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 9:17 pm Digital Edition : PRAJA VANI

రాష్ట్ర ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డుకు కంది భజరంగ్ ప్రసాద్ ఎంపిక.

*రాష్ట్ర ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డుకు కంది భజరంగ్ ప్రసాద్ ఎంపిక..!*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

రాష్ట్ర ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డుకు కంది భజరంగ్ ప్రసాద్ ఎంపికయ్యారు. ఈ నెల 21 న హైదరాబాద్‌ లో ఘనంగా అవార్డు ప్రదాన కార్యక్రమం జరగనుంది. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా భజరంగ్ ప్రసాద్ పురస్కారం అందుకోనున్నారు. ఫోటో జర్నలిజంలో ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కడం పట్ల జర్నలిస్ట్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.