రాష్ట్రస్థాయి కబడ్డీ బరిలో ఓదెల మోడల్ స్కూల్ విద్యార్థులు
రాష్ట్రస్థాయి కబడ్డీ బరిలో ఓదెల మోడల్ స్కూల్ విద్యార్థులు జిల్లా పోటీల్లో సత్తా చాటి రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీకృష్ణ, పార్ధు ఎంపిక ఓదెల, పెద్దపల్లి, ప్రజావాణి ప్రతినిధి: క్రీడా రంగంలో ప్రతిభను చాటుతూ ఓదెల తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు మరోసారి విజయపథంలో అడుగులు వేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18న ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో నిర్వహించిన అండర్–17 కబడ్డీ పోటీల్లో పాఠశాలకు చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు....