prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 1:49 pm Digital Edition : PRAJA VANI

బొమ్మందేపల్లి గ్రామంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్సై సాయి కృష్ణ.

*బొమ్మందేపల్లి గ్రామంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్సై సాయి కృష్ణ.*

నసురుల్లాబాద్ నవంబర్ 19 (ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండల పరిధిలో బొమ్మందేవ్ పల్లి గ్రామంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్సై సాయి కృష్ణ మాట్లాడుతూ సైబర్ నేరాలు ట్రాఫిక్ నిబంధన పై పోలీసుల అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజా భద్రత మరియు కమ్యూనిటీ పోలీస్ భాగంలో ఎస్ హెచ్ ఓ సాయి కృష్ణ ఆధ్వర్యంలో బొమ్మందేపల్లి గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమంలో ఈ సదస్సులో ప్రధానంగా సైబర్ నేరాల నివారణ నిర్మూలన మరియు ట్రాఫిక్ నిబంధన ప్రాముఖ్యతపై గ్రామస్తులకు వివరించారు ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని ఏదైనా సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 హెల్ప్ లైన్ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. మత్తు పదార్థాలకు బానిస కాకుండా బంగారు భవిష్యత్తును నిర్ణయించుకోవాలని గ్రామాన్ని డ్రగ్స్ రహిత గ్రామంగా తీర్చిదిద్దినందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. అలాగే రోడ్డు ప్రమాదాలు నివారణకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఎస్సై సాయి కృష్ణ తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఇటువంటి అవగాహన కార్యక్రమం నిర్వహించినందుకు గ్రామ ప్రజలకు సైబర్ మూసాలపై పలు సూచనలు చేశారు. ఓటిపి. ఏటీఎం పిన్. యూపీఐ పిన్. సి వి వి నెంబర్. బ్యాంక్ ఖాతా వివరాలు. పాస్వర్డ్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, యువకులు, పోలీసులు సిబ్బందిలు తదితరులు పాల్గొన్నారు.