*పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది*
*మహిళలకు లక్షధికారులు చెయ్యడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం*
*దేశంలోనే అత్యధిక పెన్షన్లు తెలంగాణలోనే : నియోజకవర్గ ఇంచార్జ్ డా చంద్రశేఖర్*
*మొగుడంపల్లి మండల లబ్ధిదారులకు చేయూత పింఛన్ల పత్రాల పంపిణీ*
జహీరాబాద్, నవంబర్ 18 (ప్రజావాణి): పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళలకు ఆర్థిక స్వాలాంబన కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ డా చంద్రశేఖర్ అన్నారు. బుధవారం మొగుడంపల్లి మండల కేంద్రంలోని అజాన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మొగుడంపల్లి మండలానికి మంజూరైన నూతన చేయూత పెన్షన్ పత్రాలను మాజీ మంత్రివర్యులు డా ఎ చంద్రశేఖర్, డా ఉజ్వల్ రెడ్డి లు ముఖ్య అతిథిగా పాల్గొని, అర్హులైన లబ్ధిదారులకు ‘చేయూత’ పింఛన్ల పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు.
అందులో భాగంగానే చేయూత పింఛన్ల వంటి అన్ని సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు నేరుగా అందిస్తున్నారని పేర్కొన్నారు.. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, సీడీసీ చైర్మైన్ ముబీన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ, మండల అధ్యక్షులు పవన్ రాథోడ్, మాజీ మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్, కాంగ్రెస్ నాయకులు ఉజ్వల్ రెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షులు కండేం నర్సింలు, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మ, మండల సర్పంచులు రాజు మొగుడం పల్లి, జాడి మల్కాపూర్ రాజు, బ్రహ్మానందరెడ్డి ఖాన్ జమాల్ పుర్, సుభాష్ రాథోడ్ మీర్జామ్ పల్లి, గొట్టిగర్ పల్లి సర్పంచ్ ప్రతినిధి ప్రవీణ్ రెడ్డి, మండలం కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఈ విట్టల్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, రంగా అరుణ్ కుమార్, మహేష్ మార్క్, వార్డు మెంబర్ మహేష్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.