*పుస్తకం పట్టని చేయి.. రేపు అడుక్కునే చేయి అవుతుంది!_*
*ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:-
వెంకటాపుర్ మండలం
లక్ష్మీదేవిపేటలో బుధవారం జరిగింది. కేవలం ఫంక్షన్ కాదు చెంపదెబ్బ
ఎవరికి ఫోన్ లో మునిగి పుస్తకాన్ని మర్చిపోయిన ఈ తరానికి
కలం ఫౌండేషన్..సర్వర్ అహ్మద్. సైలెంట్ గా వచ్చి సౌండ్ లేకుండా బాంబు పేల్చాడు!
పిల్లలూ… రాయండి!” అన్నాడు… పిల్లలు రాశారు… పెద్దలు షాక్ అయ్యారు!
ఎందుకంటే… ఈ పిల్లలు రాసినది వ్యాసం కాదు… వాళ్ల గుండె మంట.
ఇవాళ పిల్లలు పుస్తకం ముట్టుకోవడం లేదు… ఫోన్ వదలడం లేదు!
రీల్స్ చూస్తూ… రేపటి భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు!
అదే స్టేజ్ మీద చైర్ పర్సన్ చంద్రకళ గట్టిగా చెప్పారు!
“పుస్తకం చదివినోడు రాజు అవుతాడు… ఫోన్ చూసినోడు బానిస అవుతాడు!
అంతే… హాల్ లో నిశ్శబ్దం… నిజం చెబితే అలాగే ఉంటుంది!
గ్రంథాలయం అంటే… ముసలి పుస్తకాల గోదాము అనుకుంటున్నారా
పిచ్చోళ్లారా. గ్రంథాలయం అంటే… బాంబుల కంటే పవర్ ఫుల్ ఆయుధం
ఒక్క పుస్తకం. ఒక్క పిల్లాడి జీవితాన్ని మార్చేస్తుంది
ఒక్క వ్యాసం ఒక్క ఊరి తలరాతను తిప్పేస్తుంది
గెలిచిన పిల్లల చేతిలో బహుమతి పెట్టినప్పుడు వాళ్ల కళ్లలో చూశారా
అది సంతోషం కాదు నేను ఎవరికీ తక్కువ కాదు అనే పొగరు
ఈ తరానికి పొగరు కావాలి చదువు మీద పొగరు
కలం ఫౌండేషన్ చేస్తున్నది సేవ కాదు… యుద్ధం
అజ్ఞానం మీద యుద్ధం. ఫోన్ వ్యసనం మీద యుద్ధం… నిరక్షరాస్యత మీద యుద్ధం.
ఇతర పత్రికలు రాస్తాయి. బహుమతులు ఇచ్చారు అని
మనం రాస్తాం భవిష్యత్తుకు బాట వేశారు. అని
ఎందుకంటే లక్ష్మీదేవిపేటలో నిన్న పిల్లలు బహుమతి గెలవలేదు… భవిష్యత్తును గెలిచారు.
