పట్టభద్రుల కోసం పోరాడే నాయకుడు కావాలి.. ప్రశ్నిస్తాం.. పోరాడుతాం.. పరిష్కరిస్తాం: డా॥ నలమాస శ్రీకాంత్ గౌడ్
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 19 (ప్రజావాణి): వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ అభ్యర్థిగా డా॥ నలమాస శ్రీకాంత్ గౌడ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో, పార్టీ రూపొందించిన ‘పాంచజన్యం’ మేనిఫెస్టోను ఆయన వివరించారు. పట్టభద్రులు, నిరుద్యోగ యువత, ఉద్యోగులు, రైతులు, మహిళల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పలు హామీలను ప్రకటించారు. జనగామ జిల్లా కేంద్రంలోని కామాక్షి ఫంక్షన్ హాల్లో తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు ఆనంతుల ఆంజనేయులు...