నేడు కస్తూర్బా పాఠశాల భవనం ప్రారంభం…
రాయపోల్, నవంబర్ 19 (ప్రజావాణి)
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.3.87 కోట్లతో కస్తూర్బా పాఠశాల భవన నిర్మాణానికి అప్పటి మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితరులు శంకుస్థాపన చేశారు. 2022లో పనులు ప్రారంభించగా నాలుగేళ్ల తర్వాత కొత్త భవనం ప్రారంభించడానికి అందుబాటులోకి వచ్చింది. దీంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
విశాలమైన గదులు, చుట్టూ ప్రహరీ నిర్మాణంతో పాటు అన్ని వసతులతో పాఠశాల భవనం నిర్మించారు. తాత్కాలిక భవనంలో ఏండ్ల తరబడి విద్యనభ్యసించిన విద్యార్థులకు నేటితో కొత్త భవనం అందుబాటులోకి రానుంది.
కాగా నేడు సిద్దిపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి కస్తూర్బా గాంధీ పాఠశాల భవనాన్ని ప్రారంభించనున్నారు. అదే పాఠశాల భవన పక్కన అదనపు గదుల నిర్మాణానికి ప్రస్తుతం రూ.3.11 కోట్లు మంజూరు కాగా వాటి పనులు ప్రారంభించేందుకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు తెలిపారు…